దాడి ఘటన విచారించి జగన్ పేరు తొలగిస్తాం: డిఐజి

కాగా ఇటీవల పులివెందుల పోలీసులు తమ పార్టీకి చెందిన ఓ యువకుడిని దారుణంగా చితకబాదారని వైయస్ జగన్‌తో సహా పలువురు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు పోలీసు స్టేషన్ ముందు ధర్నాకు దిగిన విషయం తెలిసిందే. ఆ సంఘటనలో కొందరు పోలీసు స్టేషన్ పైన దాడి చేసినట్లు కేసు నమోదైంది. అయితే దాడి చేసిన విషయాన్ని జగన్ ఖండించారు. తాము శాంతియుతంగా ధర్నాకు దిగామని, యువకుడిని నిర్ధాక్షిణ్యంగా పోలీసులు కొడితే ప్రశ్నించడానికే ఆందోళనకు దిగామన్నారు.












Click it and Unblock the Notifications