మాలో చిచ్చు పెట్టేందుకు కుట్ర: కాంగ్రెసు నేత కెకె

K Keshav Rao
హైదరాబాద్: మాలో చిచ్చు పెట్టేందుకు కొందరు కుటిల ప్రయత్నాలు చేస్తున్నారని తెలంగాణ ప్రాంత కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత కె కేశవ రావు శనివారం అన్నారు. మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి దీక్ష, భవిష్యత్తు కార్యాచరణపై తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులు కెకె ఇంట్లో ఉదయం భేటీ అయ్యారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. కోమటిరెడ్డి దీక్షకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని కెకె అన్నారు. ప్రముఖ స్వతంత్ర సమర యోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ ఢిల్లీలో చేసే దీక్షకూ తమ మద్దతు ఉంటుందన్నారు. తెలంగాణ కోసం ఎవరు ఉద్యమించినా తాము సహకరిస్తామన్నారు. తమలో తమకు ఎలాంటి విభేదాలు లేవని, ఐక్యంగా ఉద్యమిస్తేనే తెలంగాణ సాధ్యమన్నారు.

కోమటిరెడ్డి దీక్ష నిర్ణయం ఈ రోజు తీసుకున్నది కాదని రెండు నెలల క్రితం తీసుకున్నారని మందా జగన్నాథం అన్నారు. ఆయన దీక్ష ఏ పరిస్థితుల్లోనూ వాయిదా వేసే ప్రసక్తి లేదని, ఆయనకు తమ మద్దతు ఉంటుందన్నారు. పత్రికలు ఊహాజనిత వార్తలు రాయవద్దని కోరారు. పోలవరం టెండర్ల అంశం తెలుగుదేశం, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలు చూసుకుంటాయని తమకు సంబంధం లేదని పొన్నం ప్రభాకర్ అన్నారు. అయితే ప్రభుత్వంపై విమర్శలు వస్తున్నందున సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉందన్నారు. టిడిపి కెసిఆర్ పైన వ్యక్తిగతంగా విమర్శలు చేసుకుంటే తమకు అభ్యంతరం లేదని కానీ సకల జనుల సమ్మెపై చేస్తే సహించేది లేదన్నారు.

రెండు ప్రాంతాలలో ఉద్యమాలు చేసుకోమని చెప్పిన టిడిపి చీఫ్ నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలపై తెలంగాణ టిడిపి నేతలు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఉద్యమం వ్యక్తుల చేతుల్లో లేదని ప్రజల చేతుల్లో ఉందన్నారు. టిడిపి తెలంగాణ నేతలు ఉద్యమ స్ఫూర్తిని దెబ్బతీసేలా మాట్లాడుతున్నారని విమర్శించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+