రాజకీయ చిక్కుల్లో బాలకృష్ణ, వ్యాఖ్యలపై దుమారం

బాలకృష్ణపై కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్ కూడా మండిపడ్డారు. తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడితే తాము బాలకృష్ణను కూడా సహించబోమని ఆయన అన్నారు. మరోవైపు, కాంగ్రెసు నాయకుడు చిరంజీవి కుమారుడు, సినీ హీరో రామ్ చరణ్ తేజ్‌పై చేశారని భావిస్తున్న బాలయ్య వ్యాఖ్యపై కూడా తీవ్ర దుమారమే చెలరేగుతోంది. చిరంజీవి, దాసరి నారాయణ రావుల మధ్య విభేదాలను ఇది మరోసారి బయటపెట్టిందని భావిస్తున్నారు. బాలయ్య వ్యాఖ్యలు సరైనవేనంటూనే చిరంజీవి వ్యతిరేకత ప్రదర్శించిన సూచనలు కనిపిస్తున్నాయి. తెలుగు సినీ హీరోలపై బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలను ఉప సంహరించుకోవాలని కాంగ్రెసు ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ వ్యాఖ్య కూడా క్రమంగా రాజకీయ రంగు పులుముకునే అవకాశం ఉంది.
ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశిస్తానని, ఎన్నికల్లో పోటీ చేస్తానని గతంలో ప్రకటించిన బాలయ్య రాజకీయంగా తన వైఖరిని చెప్పాలనే ఉద్దేశంతోనే తెలంగాణపై మాట్లాడారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సీమాంధ్రలో తెలుగుదేశం పార్టీ క్యాడర్ జారిపోకుండా ఉండేందుకే ఆయన ఆ ప్రకటన చేశారని అంటున్నారు. గుంటూరు జిల్లాలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఓదార్పు యాత్ర చేస్తున్న సమయంలో బాలయ్య ఆ ప్రకటన చేయడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.












Click it and Unblock the Notifications