తెలంగాణపై చేసేదంతా రహస్యమే, తెలియదు: డిఎస్

తెలంగాణపై కేంద్రం త్వరలోనే నిర్ణయం తీసుకుంటుందని అనిపిస్తోందని, కేంద్ర హోం మంత్రి చిదంబరం ప్రకటనను బట్టి ఆ విషయం అర్థమవుతోందని ఆయన అన్నారు. తెలంగాణపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని పార్టీ అధిష్టానం కూడా చెబుతోందని, అందువల్ల పార్టీ నాయకులు సంయమనంతో వ్యవహరించాల్సి ఉంటుందని ఆయన అన్నారు. శానససభ్యులు పార్టీ మారడం తొందరపాటు చర్య అని ఆయన అన్నారు. మనోభావాలు తీవ్రంగా ఉన్నాయి కాబట్టి తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు దాన్ని వాడుకోవాలని చూస్తున్నారని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా అన్నారు. తెరాస సంఖ్యాబలం పెంచుకోవడానికి ప్రయత్నిస్తోందని ఆయన అన్నారు.
తెలంగాణ కోసం త్యాగం చేయడమంటే ఏమిటని ఆయన అన్నారు. రాజీనామాలు చేసి తిరిగి పోటీ చేసి మళ్లీ చట్టసభల్లోకి రావడమే త్యాగమా అని ఆయన అడిగారు. రాజీనామాలు చేసినవారు తిరిగి పోటీ చేసి మళ్లీ చట్టసభల్లో కూర్చుకుంటున్నారని, దానివల్ల ఫలితం ఉండదని తాను మొదటి నుంచీ చెబుతూ వస్తున్నానని ఆయన అన్నారు. తాను తెలంగాణకు కట్టుబడి ఉన్నానని, తెలంగాణకు త్యాగమంటే రాజీనామాలు చేసి తిరిగి పోటీ చేసి ఎన్నిక కావడం కాదని, నిబద్ధత ముఖ్యమని ఆయన అన్నారు. రాజీనామాల వల్ల తెలంగాణ రాదని ఆయన అన్నారు రాష్ట్రంలో పరిస్థితులు త్వరలో కొలిక్కి వస్తాయని, ఆ దిశగా ప్రయత్నాలు జోరందుకున్నాయని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications