పాపం తెలంగాణ మంత్రులదే, దిగి వచ్చేది: కోదండరామ్

Kodandaram
నల్లగొండ: తెలంగాణ మంత్రులు రాజీనామాలు చేసి ఉంటే కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై దిగి వచ్చేదని, తప్పు తెలంగాణ మంత్రులది, ప్రజాప్రతినిధులదని తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ కోదండరామ్ అన్నారు. ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఆయన బుధవారం సంఘీభావం ప్రకటించారు. దీక్షా శిబిరంలో మాట్లాడారు. తెలంగాణ కోసం తెలంగాణ ప్రజలంతా ఏకమయ్యారని, కానీ రాజకీయ నాయకులు ఏకం కావడం లేదని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజా ప్రతినిధులు రాజీనామాలు చేసి ఉంటే కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చేదని ఆయన అన్నారు. సకల జనుల సమ్మె ఫలితం సాధించిందని, ఫలితం సాధించలేదనే మాటల్లో నిజం లేదని ఆయన అన్నారు.

సకల జనుల సమ్మె వల్లనే కేంద్ర ప్రభుత్వంలో తెలంగాణపై కదలిక వచ్చిందని ఆయన అన్నారు. సకల జనుల సమ్మె విరమణపై వస్తున్న విమర్శలను ఆయన తిప్పికొట్టారు. ఉద్యమమేదీ ఒక రూపంలో నిరంతరం సాగదని, పంథా మార్చుకోవాల్సి ఉంటుందని ఆయన అన్నారు. బండిని ఒకే బ్రేకులో నడపడం సాధ్యం కాదని, అలాగే ఉద్యమాన్ని కూడా ఒకే పంథాలో నడపడం సాధ్యం కాదని, పరిస్థితిని బట్టి ఉద్యమ స్వరూపం మారాల్సి ఉంటుందని ఆయన అన్నారు. తెలంగాణ ఉద్యమ పంథా మాత్రమే మారిందని ఆయన చెప్పారు. కేంద్రంపై ఒత్తిడి తేవడానికే కోమటిరెడ్డి వెంకట రెడ్డి ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+