చంద్రబాబే జగన్ టార్గెట్, రైతు పోరుపై వ్యాఖ్యలు

నష్టపరిహారం కోసమే రైతులు మరణిస్తున్నారని అన్న చంద్రబాబు ఇప్పుడు కరవు యాత్రలు చేస్తున్నారని ఆయన అన్నారు. ప్రజలపై, ప్రజా సమస్యలపై చంద్రబాబు సానుభూతి లేదని ఆయన అన్నారు. ఎన్టీ రామారావు మద్యనిషేధం విధిస్తే చంద్రబాబు పల్లెపల్లెనా బెల్టు షాపులు పెట్టారని ఆయన విమర్శించారు. అధికారం ఉన్నప్పుడు పట్టించుకోని చంద్రబాబు ఇప్పుడు అన్నదాతను ఉద్ధరిస్తానని అంటున్నారని ఆయన అన్నారు. ప్రభుత్వం, ప్రతిపక్షం కుమ్మక్కయిన విచిత్రమైన పరిస్థితి రాష్ట్రంలో ఉందని, వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం, కాంగ్రెసులకు డిపాజిట్లు కూడా రావని ఆయన అన్నారు. చంద్రబాబు ఏనాడైనా ప్రభుత్వ పాఠశాలకు వెళ్లి పేద విద్యార్థుల కష్టాలు తెలుసుకున్నారా అని ఆయన ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications