ఏ క్షణంలోనైనా తెలంగాణ ప్రకటన: పిసిసి చీఫ్ బొత్స

అంతకుముందు కార్మిక శాఖ మంత్రి దానం నాగేందర్ కోమటిరెడ్డిని పరామర్శించారు. త్వరలో కేంద్రం తెలంగాణపై ఓ నిర్ణయం తీసుకుంటుందన్నారు. కోమటిరెడ్డి వద్దకు కేంద్రం ఓ బృందాన్ని పంపేలోగానే ఆయన ఆరోగ్యం క్షీణించిందన్నారు. మంత్రిగా కాకుండా ఓ సన్నిహితుడిగా దీక్ష విరమించాలని కోరినట్లు చెప్పారు. బక్రీద్ తర్వాత తెలంగాణపై నిర్ణయం వెలువడే అవకాశముందన్నారు. కాగా బొత్స దీక్ష విరమించాలని కోరడంలో తప్పు లేదని అయితే వెంకట్ రెడ్డి దీక్ష విరమిస్తానని చెప్పలేదని ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఆరు రోజులుగా దీక్ష చేస్తున్నా ప్రభుత్వం స్పందించలేదన్నారు. రంగారెడ్డి, హైదరాబాదులలో తెలంగాణవాదం ఉందో లేదో ఎన్నికలకు వెళితే తెలుస్తుందన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కేంద్రానికి తప్పుడు నివేదికలు పంపిస్తున్నారని ఆరోపించారు.
కోమటిరెడ్డి వెంకటరెడ్డిని తెలంగాణ ప్రజాఫ్రంట్ అధ్యక్షుడు గద్దర్, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. నారాయణ కూడా పరామర్శించారు. ఉప ఎన్నికల వల్ల తెలంగాణ రాదని గద్దర్ అన్నారు. ప్రజల్లోకి వచ్చి ఉద్యమం చేస్తేనే తెలంగాణ వస్తుందని ఆయన అన్నారు. ఈ నెల 8వ తేదీ తర్వాత తెలంగాణపై ప్రకటన వస్తుందని అంటున్నారని, అది తెలంగాణకు వ్యతిరేకంగా వస్తే అగ్గి రాజుకుంటుందని నారాయణ అన్నారు. తెలంగాణకు ప్యాకేజీలంటే తెలంగాణలో కాంగ్రెసు ప్యాక్ కావడం ఖాయమని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications