ముగ్గురు మంత్రులతో భన్వరీకి అఫైర్, బ్లాక్ మెయిల్?

కేవలం నెలకు 8 వేల రూపాయల వేతనం పొందిన భన్వరీ పెద్ద యెత్తున సొమ్ము ఎలా కూడగట్టిందనే విషయంపై కూడా సిబిఐ అధికారులు సమాచారం సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఆమె ఆదాయ మార్గాలపై సిబిఐ దృష్టి పెట్టినట్లు సమాచారం. భన్వరీ దేవి సెప్టెంబర్ 1వ తేదీన జోధ్‌పూర్‌లోని బిలారా ప్రాంతం నుంచి అదృశ్యమైంది. ఆమె అదృశ్యమైన వ్యవహారంలో మాడర్నా పేరు ముందుకు వచ్చింది. దీంతో ఆయనను రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ మంత్రి పదవి నుంచి తొలగించారు. సిడిని అడ్డం పెట్టుకుని భన్వరీ దేవి మాడర్నాను బ్లాక్ మెయిల్ చేసినట్లు అనుమానిస్తున్నారు.
భన్వరీ దేవి మాడర్నాను మాత్రమే కాకుండా తనతో లైంగిక సంబంధాలు పెట్టుకున్న అందరినీ బ్లాక్ మెయిల్ చేసి ఉంటుందని భావిస్తున్నారు. మాడర్నా భన్వరీదేవితో రాసలీలలు నడుపుతున్న దృశ్యాలను రికార్డు చేసిన సిడి అజ్మీర్‌లోని బ్యాంక్ లాకర్‌లో ఉంది. గురువారం, శుక్రవారాల్లో సిబిఐకి చిక్కిన వీడియో క్లిప్పింగ్‌లో సిడికి సంబంధించిన ప్రస్తావన ఉంది. వీడియో క్లిప్పింగులో భన్వరీ దేవి శాసనసభ్యుడు మల్కాన్ సింగ్ సోదరితో మాట్లాడిన సంభాషణలు, కేసులో కీలకమైన నిందితుడు వైష్టోయితో జరిపిన సంభాణలు ఉన్నాయి. సోహన్ లాల్ వైష్ణోయిని సిబిఐ అధికారులు అరెస్టు చేశారు.












Click it and Unblock the Notifications