సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై పోలీసు కేసు నమోదు

దాంతో ఎమ్మెల్యే అక్కడే ఉన్న మహిళలకు, విలేకరులకు ఆ బియ్యాన్ని చూపించారు. మహిళలు బియ్యం బాగానే ఉన్నాయంటూ సదరు యువకుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో అగ్రహం చెందిన జగ్గారెడ్డి వెంటనే ఆ యువకుడి చెంప చెల్లుమనిపించారు. బియ్యం విషయం ఎలా ఉన్నా ప్రజాప్రతినిధి వద్దకు సమస్య చెప్పుకోవడానికి వస్తే కొట్టడం ఏమిటనే విమర్శలు అందరి నుండి వినిపించాయి. టిడిపి నేతలు కూడా ఈ విషయాన్ని ప్రెస్ మీట్‌లలో ప్రస్తావించారు. దీంతో పోలీసులు సోమవారం ఆయనపై కేసు నమోదు చేశారు.












Click it and Unblock the Notifications