నా తడాఖా చూపిస్తా: కాకా, పరిస్థితి వివరిస్తానన్న డిఎస్

కేంద్రం ఇప్పటికైనా తెలంగాణపై స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ఆంధ్ర రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన శ్రీ పొట్టి శ్రీరాములుకు తెలంగాణకు సంబంధం లేదన్నారు. కేంద్రం తమాషా ప్రజలకు త్వరలో చూపిస్తానన్నారు. అంతకుముందు కోమటిరెడ్డిని పరామర్శించిన డిఎస్ మాట్లాడుతూ దీక్ష విరమించాలని కోరినట్లు చెప్పారు. అధిష్టానం ఆయన పోరాటాన్ని గుర్తిస్తుందన్నారు. కేంద్రం తెలంగాణపై త్వరలో ఓ నిర్ణయం తీసుకోనుందని, ఇక్కడి పరిస్థితులను వివరిస్తానని చెప్పారు. గతంలోని హామీలకు కాంగ్రెసు పార్టీ కట్టుబడి ఉందన్నారు. తెలంగాణపై ప్రజల ఆశలు నెరవేర్చే దిశలో అధిష్టానం నిర్ణయం ఉంటుందన్నారు.
తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరాం కూడా కోమటిరెడ్డిని పరామర్శించారు. కొండా లక్ష్మణ్ బాపూజీ దీక్షకు జెఏసి మద్దతు ప్రకటిస్తుందన్నారు. కోమటిరెడ్డి దీక్షను బలవంతంగా ప్రభుత్వం భగ్నం చేసిందన్నారు. చర్చలతో సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కేంద్రం వెంటనే తెలంగాణపై ప్రకటన చేయాలన్నారు. ఇందుకు తెలంగాణ కాంగ్రెసు నేతలు అధిష్టానంపై ఒత్తిడి తీసుకు రావాలన్నారు.












Click it and Unblock the Notifications