కేక్ కట్ చేయడం కాదు: తెలంగాణపై కెకె సంచలనం

మిలియన్ మార్చ్ సందర్భంగా గొడవ జరిగితే హింస అన్నారని, శాంతియుతంగా ఆందోళన చేస్తే ఉద్యమం లేదని కేంద్రమంత్రి చిదంబరం అంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డియే బాధ్యుడన్నారు. ఆయన తప్పుడు నివేదికలను కేంద్రానికి పంపిస్తున్నారని ఆరోపించారు. శాంతియుతంగా ఉద్యమిస్తున్న వారిపై పిడి యాక్టులంటూ కేసులు పెడుతూ రెచ్చగొట్ట వద్దని సూచించారు. అరెస్టులకే కాదని తూటాలకు తాము భయపడేది లేదన్నారు. ప్రభుత్వం రెచ్చగొట్టే చర్యలకు పూనుకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయన్నారు.
మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని అరెస్టు చేసిన తీరు బాగా లేదన్నారు. ఆయన తన దీక్షను కొనసాగిస్తున్నారని చెప్పారు. దీక్ష విరమింప జేసేందుకు తాము ఏం చేయాలో ఆలోచిస్తున్నామన్నారు. తెలంగాణ కోసం ఎందరో బలిదానాలు చేశారన్నారు. కోమటిరెడ్డి అరెస్టుకు నిరసనగా మంగళవారం నల్గొండ జిల్లా బందుకు పిలుపు ఇస్తున్నట్లు చెప్పారు.












Click it and Unblock the Notifications