జగన్ ఓ సినిమా చూసి మరోటి చూపించారు: నారాయణ

Narayana
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సిబిఐ అధికారుల ముందు ఓ సినిమా చూసి బయట మాత్రం మనకు మరో సినిమా చూపిస్తున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్సి నారాయణ సోమవారం ఎద్దేవా చేశారు. ఏ విషయాన్ని అయినా మసిపూసి మారేడుకాయ చేస్తే ప్రజలు నమ్మరన్నారు. జగన్ తప్పు చేస్తే జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. మంత్రుల రాజీనామాలతోనే తెలంగాణ సాధ్యమన్నారు. రాష్ట్రంలో కరవు సహాయక చర్యలు ప్రభుత్వం వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు. లేదంటే కరీంనగర్‌లో 15న ఆందోళన చేపడతామని హెచ్చరించారు.

రాష్ట్రంలో రైతులు పంట విరామం ప్రకటించినా ప్రభుత్వం రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదని సిపిఎం శాసనసభాపక్ష నేత జూలకంటి రంగారెడ్డి నల్గొండ జిల్లాలో అన్నారు. వర్షాలు లేక నీరందక పంటలు ఎండిపోయి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. ఎకరానికి రూ.10వేల చొప్పున రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. బ్యాంకు రుణాలకు వడ్డీలు మాఫీ చేసి వడ్డీలేని రుణాలు ఇచ్చి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+