తెలంగాణకోసం ఓయు విద్యార్థి ఆత్మహత్య, ర్యాలీ ఉద్రిక్తం

కాగా సోమవారం ఉదయం మంచిర్యాల రైల్వే స్టేషన్‌లో రైలు కింద పడి నగేష్ అనే ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనాస్థలంలో తాను తెలంగాణ కోసమే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తెలుపుతూ ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌కు రాసిన లేఖ లభించింది. మృతుడు కాగజ్ నగర్ మండలానికి చెందిన చింతలగూడ వాసి. నగేష్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హాస్పిటల్ తరలించారు. నగేష్ మృతదేహాన్ని తమకు అప్పగించాలని టిఆర్ఎస్ శాసనసభ్యుడు సమ్మయ్య ప్రభుత్వాసుపత్రి ముందు బైఠాయించారు.












Click it and Unblock the Notifications