జగన్‌కు షాక్, కాంగ్రెసులోకి ఏడుగురు ఎమ్మెల్యేలు?

YS Jagan
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఆయన వర్గం కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులు షాక్ ఇవ్వానున్నారనే ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి. జగన్ కోసం రాజీనామా చేసిన 26 మంది శాసనసభ్యులలో ఏడుగురు శాసనసభ్యులు తిరిగి కాంగ్రెసు గూటికి చేరనున్నారనే వార్తలు వస్తున్నాయి. తిరిగి కాంగ్రెసులో చేరాలనుకున్న ఏడుగురు ఎమ్మెల్యేలు సోమవారం ఓ రహస్య ప్రదేశంలో భేటీ కూడా అయినట్లు తెలుస్తోంది. వారు మరోసారి సమావేశమై నిర్ణయాన్ని ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే తిరిగి కాంగ్రెసులోకి వెళ్లి పోవాలని మానసికంగా వారు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది.

రాజీనామాలు చేసినప్పటి నుండి నియోజకవర్గంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్న దృష్ట్యా వారు ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. రాజీనామాలు చేసి నెలలు గడుస్తున్నా పార్టీ కార్యాచరణ ప్రకటించక పోవడం, స్పీకర్ రాజీనామాలు ఆమోదిస్తే తమకే టిక్కెట్ ఇచ్చే అంశంపై జగన్ నోరు మెదపక పోవడం వారిలో ఆందోళన కలిగిస్తున్నట్లుగా సమాచారం. అంతేకాకుండా ఇటీవల రచ్చబండ కార్యక్రమంతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ప్రజల్లోకి వెళ్లడం, వారి వారి నియోజకవర్గాల్లో మంత్రులే కార్యక్రమాలు చక్క బెట్టడం వలన నియోజకవర్గంలో ప్రాధాన్యత లేకుండా పోతోందని ఇలా అయితే వచ్చే ఎన్నికల్లో తమ రాజకీయ భవిష్యత్తు అగమ్యగోచరంగా తయారవుతుందని అంతకంటే కాంగ్రెసులో చేరడమే మేలని వారు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.

అంతేకాకుండా ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా జగన్ కటకటాల వెనక్కి వెళితే తమ పరిస్థితి ఏమిటనే ఆందోళన కూడా వారిని వెంటాడుతోందట. జగన్ ఓదార్పు, కేసులతో బిజీ అయిపోయి తమ భవిష్యత్తుపై ఏమాత్రం స్పందించడం లేదనే ఆందోళనలో ఉన్నారని తెలుస్తోంది. ఎన్నికలకు మరో రెండున్నరేళ్లు ఉన్నందున సేఫ్ సైడ్‌గా కాంగ్రెసు వైపు వెళ్లడమే ఉత్తమమని వారు భావిస్తున్నారట. ఇక మొదటిసారి గెలిచిన వారి పరిస్థితి మరీ దారుణంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే నియోజకవర్గాలకు కొత్తగా ఎన్నిక కావడంతో వారి వారి నియోజకవర్గాల్లో ఇంచార్జులను నియమిస్తే తమకు వారు చెక్ చెప్పడం ఖాయమనే ఆందోళన చెందుతున్నారుట. ఈ ఏడుగురి బాటలోనే మరికొందరు జగన్ ఎమ్మెల్యేలు బయటకు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయనే వార్తలు వస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+