డి శ్రీనివాస్ ముఖ్యమంత్రి పీఠంపై కన్నేశారా?

తనకు ఏ బాధ్యతలు అప్పగించినా తన పూర్తి సామర్థ్యం మేరకు పనిచేస్తానని ఆయన చెప్పారు. తనకు ఏ బాధ్యతలు అప్పగించినా ఫరవా లేదని ఆయన అన్నారు. తెలంగాణ సమస్య పరిష్కారంలో భాగంగా ప్రాంతీయ బోర్డులను ఏర్పాటు చేయాలని కాంగ్రెసు అధిష్టానం భావిస్తున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. ప్రాంతీయ బోర్డులను ఏర్పాటు చేస్తే తెలంగాణ ప్రాంతీయ బోర్డుకు డిఎస్‌ను చైర్మన్‌గా నియమించవచ్చవచ్చునని అంటున్నారు. లేదా ముఖ్యమంత్రిని మార్చే అవకాశాలుంటే ఆ పదవి తనకే దక్కుతుందని ఆయన ఆశతో ఉన్నారు.
ఎమ్మెల్సీ పదవిని తాను ఆశించలేదని ఆయన చెప్పారు. తెలంగాణ సమస్యపై కాంగ్రెసు కోర్ కమిటీ సీరియస్‌గా చర్చిస్తోందని, తెలంగాణకు కేంద్రం త్వరలో శాశ్వత పరిష్కారం చూపిస్తుందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications