గాలి కేసులో శ్రీలక్ష్మిని నాన్‌స్టాప్‌గా విచారిస్తున్న సిబిఐ

సిండికేట్ బ్యాంకులో శ్రీలక్ష్మి ఖాతాలను సిబిఐ అధికారులు పరిశీలించారు. ఆమె బ్యాంక్ లాకర్లను తెరిచారు. వాటిలోంచి నగదును, పత్రాలను, బంగారు నగలును స్వాధీనం చేసుకున్నారు. గనుల యజమాని శశికుమార్ ఎదుట శ్రీలక్ష్మిని సిబిఐ అధికారులు విచారించారు. శ్రీలక్ష్మి తనను లంచం అడిగినట్లు శశికుమార్ ఇంతకు ముందు ఆరోపించారు. దానిపై ఇద్దరిని ముఖాముఖి కూర్చోబెట్టి సిబిఐ అధికారులు విచారించినట్లు సమాచారం. సిండికేట్ బ్యాంకు నుంచి ఆమెను కోఠీలో గల సిబిఐ కార్యాలయానికి తీసుకొచ్చారు. సాయంత్రం పొద్దుపోయే వరకు కూడా శ్రీలక్ష్మిని సిబిఐ అధికారులు విచారిస్తూనే ఉన్నారు. సిబిఐ కార్యాలయం వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. శ్రీలక్ష్మిని ఎప్పుడైనా అరెస్టు చేసే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది.












Click it and Unblock the Notifications