వైయస్ జగన్ సేకులో భానును విచారించిన సిబిఐ

వాన్‌పిక్ ప్రాజెక్టుకు జరిపిన కేటాయింపులపై, పోర్టు పరిధుల మార్పుపై, రాయితీల ఒప్పందంపై సిబిఐ అధికారులు భానును విచారించినట్లు తెలుసస్తోంది. నిమ్మగడ్డ ప్రసాద్ ప్రమోట్ చేసిన వాన్‌పిక్ ప్రాజెక్టు జగన్ సంస్థల్లో వందలాది కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టింది. వైయస్ హయాంలో భాను మౌలిక సదుపాయాల కల్పన, పెట్టుబడుల వ్యవహారాలు చూశారు. ఆయన ఆధీనంలో నీటి పారుదల, అడవులు, రోడ్లు, భవనాలు ఉండేవి.
గాలి జనార్దన్ రెడ్డి కేసులో తనపై దుష్ప్రచారం చేస్తున్నారని భాను మీడియా ప్రతినిధులతో అన్నారు తాను నీటిపారుదల శాఖ వ్యవహారాలు మాత్రమే చూశానని, గనుల శాఖ తన పరిధిలో ఎప్పుడూ లేదని ఆయన చెప్పారు. అసలు కొండా రెడ్డి ఎవరో కూడా తనకు తెలియదని అన్నారు. తాను ఏదైనా నిర్ణయం తీసుకుంటే దాన్ని పరిశీలించేందుకు తన పై అధికారులు ఉన్నారని ఆయన చెప్పారు. ఐఎఎస్ అధికారి శ్రీలక్ష్మి తనతో ఏ రోజు కూడా మాట్లాడలేదని ఆయన స్పష్టం చేశారు. తాను వాన్‌పిక్ ప్రాజెక్టుపై సిబిఐకి వివరాలు ఇచ్చానని, తాను ఏం చెప్పాననే విషయాలు వెల్లడించలేనని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications