వెలుగు చూస్తున్న ఇద్దరు ఐఎఎస్‌ల మరిన్ని లీలలు

ఓబుళాపురం మైనింగ్ వ్యవహారాల్లోనే కాకుండా ఇతర మైనింగ్ వ్యవహారాల్లోనూ రాజగోపాల్, శ్రీలక్ష్మి అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు వస్తున్నాయి. 2004 నుంచి కడప, కర్నూలు, ఖమ్మం జిల్లాల్లోని మైనింగ్ లీజులను పెండింగులో పెడుతూ వచ్చారని, తాము 2005లో హైకోర్టుకు వెళ్తే తమకు అనుకూలంగా తీర్పు వచ్చిందని, అయినా ఆ ఇద్దరు ఐఎఎస్ అధికారులు పట్టించుకోలేదని ఆయన వివరించారు. తాము కోర్టు ధిక్కారం కింద కేసు వేస్తామని హెచ్చరిస్తే ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డిని గానీ అప్పటి ప్రభుత్వ సలహాదారు కెవిపి రామచందర్ రావును గానీ కలవాలని శ్రీలక్ష్మి చెప్పారని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications