మవోయిస్టు అగ్రనేత కిషన్‌జీ హతం, మీడియా కథనాలు

మావోయిస్టు అగ్రనేత కిషన్‌జీని భద్రతా బలగాలను చుట్టుముట్టినట్లు బుధవారం సాయంత్రం వార్తలు వచ్చాయి. అయితే, అతను తప్పించుకున్నట్లు అందరూ భావించారు. కానీ అతను ప్రత్యేక బలగాల చేతిలో హతమైనట్లు గురువారం వార్తలు ప్రసారమవుతున్నాయి. కిషన్‌జీ ఉన్నట్టు అనుమానించిన జంగల్ మహల్ ప్రాంతాన్ని పశ్చిమ బెంగాల్ సంయుక్త బలగాలు బుధవారం చుట్టుముట్టాయి. కిషన్‌జీతో పాటు మరికొంత మంది మావోయిస్టు నాయకులు ఉన్నట్లు అనుమానించారు. కిషన్‌జీ తలదాచుకున్న స్థావరం ఉన్న జంగల్ మహల్ ప్రాంతంలో సంయుక్త బలగాలు గాలింపు చర్యలకు దిగాయి. వెస్ట్ మిడ్నాపూర్ జిల్లాలోని నల్‌బనీ, కుష్బనీ, లాల్‌బనీ, ఝార్‌గ్రామ్ అటవీ ప్రాంతంలో కిషన్‌జీ తలదాచుకున్నట్లు సమాచారం అందడంతో ప్రత్యేక బలగాలు పెద్ద యెత్తున ఆపరేషన్ మొదలు పెట్టాయి.












Click it and Unblock the Notifications