తెలంగాణ ఆవిర్భావ సదస్సులో పవార్, టిఎస్సార్‌‍కు కల

T Subbirami Reddy
న్యూఢిల్లీ: పార్లమెంటు హాలులో బుధవారం ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. పార్లమెంటు సెంట్రలు హాలులో ఎన్సీపీ(నేషనలిస్ట్ కాంగ్రెసు పార్టీ) నేత శరద్ పవార్ ఉన్నారు. పవార్ వెనకాలే తెలంగాణ ప్రాంత కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు కూడా కూర్చుని ఉన్నారు. అదే సమయంలో కాంగ్రెసు రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బిరామి రెడ్డి(టియస్సార్) అక్కడకు వచ్చారు. ఆయన వస్తూనే శరద్ పవార్‌ను చూసి నవ్వుతూ జై తెలంగాణ అంటూ కరచాలనం చేశారు.

ఆ తర్వాత టియస్సారే మాట్లాడుతూ తనకు రాత్రి ఓ కల వచ్చిందన్నారు. అందులో తెలంగాణ రాష్ట్రం ఏర్పడినట్లు, రాష్ట్ర ఆవిర్భావ సభలో మీరు పాల్గొన్నట్లు కల వచ్చిందన్నారు. అందుకు పవార్ మీరు శివభక్తులని, మీకు శక్తి ఉంటుంది కాబట్టి అది నిజం కావచ్చన్నారు. అందుకు నా శక్తి వల్ల ఏమవుతుంది, అంతా దైవబలం వల్ల వస్తుందని టియస్సార్ సమాధానమిచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+