బాబు కేసు మూడు నెలల్లో పూర్తి: సిబిఐ జెడి

కాగా పత్రాలు తీసుకోక ముందు కూడా ఆయన మీడియాతో మాట్లాడారు. వైయస్ విజయమ్మ వేసిన పిటిషన్‌ను పరిశీలించాకే చంద్రబాబుపై కేసు నమోదు చేస్తామని చెప్పారు. ఈ నెల 4వ తేదిన వైయస్ విజయమ్మ బాబు ఆస్తులపై హైకోర్టులో కేసు వేసిన విషయం తెలిసిందే. బాబు ఆస్తులపై ప్రాథమిక విచారణకు హైకోర్టు ఇటీవలే పచ్చజెండా ఊపింది. సిబిఐతో పాటు ఈడి, డిజిపిలు బాబు ఆస్తులపై విచారించనున్నారు. ఇందుకు సంబంధించిన పత్రాలను కోర్టు శుక్రవారం సిద్ధం చేసింది. సిబిఐ అధికారులు వాటిని తీసుకోనున్నారు. మరోవైపు సిబిఐ దర్యాఫ్తు నేపథ్యంలో టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు సీనియర్ నేతలతో పార్టీ కార్యాలయంలో సమావేశమయ్యారు.












Click it and Unblock the Notifications