జగన్ వర్గం ఎమ్మెల్యేలు ఎద్దుల్లా వస్తున్నారు: జెసి

JC Diwakar Reddy
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ వైపు వెళ్లిన తమ పార్టీ శానససభ్యులు ఎద్దుల్లా తిరిగి వస్తున్నారని కాంగ్రెసు సీనియర్ శానససభ్యుడు జెసి దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. వైయస్ జగన్ వైపు వెళ్లిన శానససభ్యులంతా తిరిగి వస్తారని ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. వైయస్ జగన్ వైపు వెళ్లిన శాసనసభ్యులు ముఖ్యమంత్రి కార్యాలయానికే కాకుండా పార్టీ కార్యాలయానికి కూడా రావాలని ఆయన అన్నారు. రూపాయికి కిలో బియ్యం మాత్రమే ఇస్తే సరిపోదని, నిత్యావసర సరుకుల ధరలు తగ్గాలని ప్రజలు కోరుకుంటున్నారని ఆయన అన్నారు. ప్రభుత్వ ఖజానా నిండుగా ఉంటే సంక్షేమ పథకాలను అమలు చేయవచ్చునని, కానీ ఆ పథకాల వల్ల ఖజానాపై భారం పడుతుందని ఆయన అన్నారు. సంపద ఉంది కాబట్టి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి అంటున్నారని ఆయన అన్నారు.

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి ప్రతిపక్ష నేత పదవి నుంచి తప్పుకుని సిబిఐ విచారణకు సహకరించాలని కాంగ్రెసు శాసనసభ్యుడు గండ్ర వెంకటరమణా రెడ్డి అన్నారు. కాంగ్రెసు నాయకులను గ్రామాల్లోకి రానీయబోమని తెలంగాణ జెఎసి చైర్మన్ కోదండరామ్ అనడం అసంబద్ధంగా ఉందని ఆయన విడిగా శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. చంద్రబాబు ఏ రోజు కూడా రైతు నాయకుడు కాలేరని ఆయన అన్నారు. ముఖ్యమంత్రిగా ఉన్న తొమ్మిదేళ్ల కాలంలో చంద్రబాబు రైతులకు ఏం చేశారని ఆయన అడిగారు. కాంగ్రెసుపై విమర్శలు చేసిన తెలుగుదేశం శాసనసభ్యుడు రేవంత్ రెడ్డిపై కాంగ్రెసు ఎమ్మెల్సీ రుద్రరాజు పద్మరాజు విరుచుకుపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+