బాబు మోకాళ్ల దగ్గర: టిటిడిపి ఎమ్మెల్యేలపై ఈటెల ఫైర్

ప్రభుత్వంపై ఎవరు అవిశ్వాసం పెట్టినా తాము మద్దతిస్తామని చెప్పారు. కాంగ్రెసు, టిడిపి నేతలు అమరవీరుల శవాలపై ప్రమాణాలు చేసి మాట తప్పారన్నారు. టిఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ సాధన కోసమని కానీ టిడిపి మాత్రం కుట్రలతో పుట్టిన పార్టీ అని ఆ పార్టీ సిద్ధాంతం ఆత్మవంచన అన్నారు. తెలంగాణ సాధన ప్రస్థానంలో తాము చాలాసార్లు పదవులు వదులుకున్నామన్నారు. చంద్రబాబు తెలంగాణకు కట్టుబడి ఉంటే నాగం, జోగు రామన్న, గంపా గోవర్ధన్ బయటకు ఎందుకొచ్చారని ప్రశ్నించారు. అసెంబ్లీలో ఏనాడు అమరవీరులకు నివాళులర్పించలేదని, ఆత్మహత్యలు చేసుకోవద్దని విజ్ఞప్తి కూడా చేయలేదన్నారు.
కాగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంపై అసెంబ్లీలో తీర్మానం ప్రవేశ పెట్టాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రాంత లాయర్లు బుధవారం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి క్యాంపు కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. ఈ శీతాకాల సమావేశాలలోనే తెలంగాణపై తీర్మానం చేయాలని వారు డిమాండ్ చేశారు. తెలంగాణకు అనుకూలంగా నినాదాలు చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది.












Click it and Unblock the Notifications