తెలంగాణపై సోనియా నిర్ణయం:కెసిఆర్ సంచలన వ్యాఖ్య

K Chandrasekhar Rao
హైదరాబాద్: డిసెంబర్ 1వ తేది నుండి శాసనసభ సమావేశాలు ప్రారంభం అవుతున్న సమయంలో, అవిశ్వాస తీర్మానంపై పార్టీలు సవాళ్లు విసురుకుంటున్న సమయంలో తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు బుధవారం తెలంగాణపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ పార్లమెంటు సమావేశాలు అయ్యేలోగా తెలంగాణపై నిర్ణయం తీసుకుంటారని తెలంగాణ భవనంలో ఏర్పాటు చేసిన టిఆర్ఎస్ఎల్పీలో అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, గవర్నర్ నరసింహన్ పంపే నివేదికలను సోనియా నమ్మడం లేదని ఆమె రాష్ట్ర పరిస్థితులపై ప్రయివేటుగా సర్వే చేయిస్తున్నారని చెప్పారు. సర్వే ఆధారంగా ఆమె నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు.

తెలుగుదేశం పార్టీ చిత్తశుద్థితో కిరణ్ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెడితే తప్పకుండా మద్దతిస్తామని ఎమ్మెల్యేలు ఈటెల రాజేందర్, కెటి రామారావు సమావేశం సందర్భంగా మీడియాతో అన్నారు. అవిశ్వాసంపై బాబు తీరు దొంగలు పడ్డ ఆరునెలలకు కుక్కలు మొరిగినట్లుగా ఉందన్నారు. తనపై జరుగుతున్న సిబిఐ దర్యాఫ్తుపై బ్లాక్ మెయిల్ చేయడానికే అవిశ్వాసమని ఆరోపించారు. బాబు, కిరణ్ మాయావతిలాగా తెలంగాణపై తీర్మానం చేయాలని సూచించారు.

నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను లెక్కలోకి తీసుకోని ఈ ప్రభుత్వాన్ని కూల్చడమే తమ లక్ష్యమన్నారు. అసెంబ్లీలో తెలంగాణ తీర్మానం, పిడి యాక్టుల ఎత్తివేతకు డిమాండ్ చేస్తామని చెప్పారు. కేంద్రమంత్రి చిదంబరం వ్యాఖ్యలు అర్థరహితమన్నారు. రాష్ట్రంలోని పార్టీలలో ఏకాభిప్రాయం వచ్చాక ఇక ఆయన ఎందుకన్నారు. ప్రజలను మభ్యపెట్టేందుకే ఆయన ఇలా మాట్లాడుతున్నారన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+