జగన్,కెసిఆర్ ఊసరవెల్లులు:ఒప్పందాలంటూ రేవంత్ ఫైర్

Revanth Reddy
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు రేవంత్ రెడ్డి బుధవారం తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. ఇన్నాళ్లూ దమ్ముంటే అవిశ్వాసం పెట్టమని సవాళ్లు విసిరిన జగన్, కెసిఆర్‌లు ఇప్పుడు తప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. కిరణ్ ప్రభుత్వాన్ని ప్రత్యక్షంగా జగన్, పరోక్షంగా కెసిఆర్ కాపాడుతున్నారని విమర్శించారు.

ఢిల్లీలో జరిగిన ఒప్పందం మేరకే కెసిఆర్ నలుగురు ఎమ్మెల్యేల రాజీనామాలు ఆమోదింప చేసుకున్నారని అలాగే జగన్ వర్గం ఎమ్మెల్యేలు ఒక్కరొక్కరు తిరిగి కాంగ్రెసులోకి వెళుతున్నారన్నారు. వారిద్దరూ కాంగ్రెసు పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారన్నారు. కాంగ్రెసుకు మద్దతిచ్చేందుకు జగన్ ఎమ్మెల్యేలు వైవి సుబ్బారెడ్డితో జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నారని అనుమానం వ్యక్తం చేశారు. రోజుకో తీరు రంగులు మారుస్తున్న వారిని చూసి ఊసరవెల్లి కూడా భయపడుతోందన్నారు. వారు ఊసరవెల్లిని మించి రంగులు మారుస్తున్నారన్నారు.

కేంద్రమంత్రి చిదంబరం ఏర్పాటు చేసే అఖిలపక్ష సమావేశానికి తాము హాజరుకామని తెలుగుదేశం పార్టీ సీనియర్ శాసనసభ్యుడు ఎర్రబెల్లి దయాకర రావు వేరుగా చెప్పారు. చిదంబరం మాటలు తాము పట్టించుకోమని, ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీయే స్వయంగా తెలంగాణపై మాట్లాడాలని డిమాండ్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+