అవిశ్వాసానికి మద్దతు: జెపి, నోటీసు ఇస్తామన్న టిడిపి

అంతకుముందు తెలుగుదేశం పార్టీ నేత అశోక్ గజపతి రాజు మాట్లాడుతూ రేపు అసెంబ్లీలో తమ పార్టీ అవిశ్వాసానికి నోటీసు ఇవ్వనుందన్నారు. రైతుల సమస్యలే తమ ప్రధాన అజెండా అన్నారు. ధరల పెరుగుదల, విద్యుత్ సమస్య, ఫీజు రీయింబర్స్‌మెంట్, సంక్షేమ హాస్టళ్లు, చేతివృత్తుల సమస్యల తదితర అంశాలు చర్చకు రావాలని ప్రభుత్వాన్ని కోరినట్లు చెప్పారు. సమావేశాలు 15 రోజులు ఉండాలని కోరామన్నారు. ఆది, శనివారాలు సమావేశాలు పెట్టినా తమకు అభ్యంతరం లేదన్నారు. సమావేశాలు, చర్చలపై ప్రభుత్వం కుంటిసాకులు చెప్పి తప్పించుకునే ప్రయత్నాలు చేస్తోందన్నారు.
కాగా బిఏసి సమావేశంలో బిజెపి, టిఆర్ఎస్, సిపిఐ తెలంగాణపై చర్చించాలని అడిగాయి. దానికి ప్రభుత్వం అంగీకరించలేదు. మరోవైపు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ కర్నూలులో మాట్లాడుతూ టిడిపి అవిశ్వాసం పెడితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేస్తామని ప్రకటించారు. కాగా సమావేశాలు డిసెంబర్ 1 నుండి 5వ తేది వరకు జరుగుతాయి. శని, ఆదివారాల్లోనూ సమావేశాలు నిర్వహించనున్నారు.












Click it and Unblock the Notifications