సభ రసాభాస: అసెంబ్లీలో సిఎం వర్సెస్ చంద్రబాబు

ఆ తర్వాత చంద్రబాబు రాజేశ్వర్ రెడ్డికి సంతాపం తెలిపారు. తర్వాత కిరణ్, ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. మానవత్వం ఎవరికి లేదో అర్థమవుతుందని అన్నారు. ప్రజలు అసహ్యించుకునేది మా ప్రవర్తన చూసి కాదని మీవల్లే అన్నారు. అవిశ్వాసంపై తాము నోటీసులు ఇస్తే ఇప్పటి వరకు అక్నాలెడ్జ్ కాపీ ఇవ్వలేదన్నారు. సంప్రదాయాలపై మాకు చెప్పాల్సిన అవసరం లేదన్నారు. అధికారపక్షమే సభా సంప్రదాయాలు పాటించడం లేదన్నారు. అవిశ్వాసంపై నోటీసు అందిందని చెప్పమని మాత్రమే తాము కోరుతున్నట్లు చెప్పారు. అందుకు సిఎం స్పందిస్తూ అవిశ్వాస తీర్మానంపై ప్రతిపక్షం కంటే మేమే ఆతృతగా ఎదురు చూస్తున్నామన్నారు. ఆరుసార్లు ఎన్నికైనా మీకు సభలో ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితి కనిపించిందా అని బాబును ప్రశ్నించారు. అంతకుముందు శ్రీధర్ బాబు టిడిపి తీరును తప్పు పట్టారు. మొత్తానికి నిరసనల మధ్య సంతాప తీర్మానం ప్రవేశ పెట్టారు.












Click it and Unblock the Notifications