వైయస్సార్ పేరును తుడిచేయడానికే: వైయస్ జగన్

YS Jaganmohan Reddy
గుంటూరు: రూపాయికి కిలో బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైయస్సార్ పేరు ఉండకూడదనే ఉద్దేశంతో రెండు రూపాయలకు కిలో బియ్యం పథకాన్ని ప్రభుత్వం రూపాయికి మార్చిందని ఆయన విమర్శించారు. రెండు రూపాయలకు కిలో బియ్యం పథకాన్ని రూపాయికి తగ్గించి రాష్ట్ర ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోందని ఆయన అన్నారు. దివంగత నేత వైయస్ రాజశేఖర రడ్డి హామీ ఇచ్చినట్లుగా రెండు రూపాయకు కిలో బియ్యం పథకం కింద 30 కిలోల బియ్యం ఇచ్చి ఉంటే పేదలకు రూ. 300 మిగిలి ఉండేవని ఆయన అన్నారు.

గుంటూరు జిల్లా ఓదార్పు యాత్రలో భాగంగా జనగ్ గురువారం సాయంత్రం చెబ్రోలు మండలం మునిపల్లెలో వైయస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆ తర్వాత అభిమానులను ఉద్దేశించి ప్రసంగించారు. రైతులకు గిట్టుబాటు ధరలు లేక, కూలీలకు కూలీ గిట్టక అవస్థ పడుతుంటే ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు. మునిపల్లె నుంచి ఆయన పచ్చలతాడిపర్రు చేరుకుని అక్కడ వైయస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+