అవిశ్వాసం:గందరగోళంలో జగన్ వర్గం, యువనేతలోనూ

అయితే చంద్రబాబుకు ఎప్పటి నుండో సవాల్ విసురుతున్న జగన్ మాత్రం తమ ఎమ్మెల్యేలను అవిశ్వాసానికి అనుకూలంగా ఓటు వేయాలని ఆదేశిస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే జగన్ కూడా తర్జన భర్జన పడుతున్నట్లుగా కనిపిస్తోంది. బుధవారం సాయంత్రం ఓదార్పులో ఆయన దమ్ముంటే అవిశ్వాసం పెట్టాలని బాబుకు సవాల్ విసిరారు. ఆ తర్వాత కొద్ది సేపటికే తన వర్గం ఎమ్మెల్యేలను ఇరుకున పెట్టేందుకే బాబు, కిరణ్ కలిసి కుట్ర పన్నుతున్నారని ఆరోపించినట్లు వార్తలు వచ్చాయి. అయినప్పటికీ అవిశ్వాసానికి అనుకూలంగానే ఓటు వేయాలని జగన్ తన ఎమ్మెల్యేలకు ఫోన్ ద్వారా సందేశాలు ఇస్తున్నారు.
ఇదే విషయాన్ని జగన్ ఎమ్మెల్యే పూతలపట్టు రవి కూడా చెప్పారు. సమావేశం వాయిదా పడిన అనంతరం జగన్ వర్గం ఎమ్మెల్యేలు పలువురు స్పీకర్‌తో భేటీ అయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం పడిపోతుందనుకుంటే తాము అవిశ్వాసానికి మద్దతిస్తామని చెప్పారు. జగన్ తన వర్గం ఎమ్మెల్యేలతో ఫోన్లో మంతనాలు జరుపుతున్నారని చెప్పారు. కాగా మరో ఎమ్మెల్యే కాపు రామచంద్రా రెడ్డి సిఎం కిరణ్ కుమార్ రెడ్డితో భేటీ అయ్యారు. అవిశ్వాసం తీర్పానంపై చర్చించేందుకు ఈ రోజు మధ్యాహ్నం జగన్ ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా భేటీ కానున్నారు. గైర్హాజరు అయ్యే అవకాశాలనూ పరిశీలించే అవకాశముంది.












Click it and Unblock the Notifications