విజయమ్మకు జరిమానా వేయండి: మురళీమోహన్

Murali Mohan
హైదరాబాద్: తప్పుడు ఆరోపణలతో తనపై వేసిన పిటిషన్‌ను డిస్మిస్ చేసి పిటిషన్ వేసిన విజయమ్మకు జరిమానా విధించాలని సినీ నటుడు, తెలుగుదేశం నాయకుడు మురళీమోహన్ హైకోర్టును కోరారు.వైఎస్ విజయమ్మ దాఖలు చేసిన పిటిషన్‌లో వ్యక్తిగత ప్రయోజనాలే తప్ప ఎలాంటి ప్రజాప్రయోజనాలు లేవని ఆయన అన్నారు. ఆమె దాఖలు చేసిన పిటిషన్‌కు విచారణార్హత లేదని అంటూ దాని పై ఇచ్చిన ఆదేశాలు తొలగించాలని కోరుతూ బుధవారం ఆయన హైకోర్టును ఆశ్ర యించారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆస్తులతో పాటు మరో 12 మందిపై సీబీఐ విచారణకు ఆదేశిస్తూ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై ఆయన వెకేట్ పిటిషన్ దాఖలు చేశారు.

విజయమ్మ తనపై మోపిన అభియోగాలన్నీ నిరాధారమైనవని, రాజకీయ ప్రేరేపితమైనవని మురళీమోహన్ ఆరోపించారు. ప్రతివాదులుగా ఉన్నవారికి అవినీతి మకిలి అంటగడుతూ పిటిషన్ వేశారని, అందులో ఎక్కడా వాస్తవాలు కోర్టుకు వెల్లడించలేదని తెలిపారు. విజయ చేసిన ఆరోపణలపై తమ వాదనలు చెప్పడానికి తగిన అవకాశం ఇవ్వలేదని, ఇది సహజ న్యాయసూత్రాలకు వ్యతిరేకమని కోర్టుకు విన్నవించారు. టీడీపీలో తాను చురుకైన కార్యకర్తనని, 2009లో పార్టీ తరఫున లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేశానని ఆయన చెప్పారు.

రాజకీయ కారణాలతోనే తనను ప్రతివాదిగా చేర్చారని, అప్పటి ప్రభుత్వం నుంచి తాను ఏ సహాయం పొందలేదని తెలిపారు. 500లకుపైగా సినిమాల్లో నటించిన తనకు చిత్రాల పంపిణీ వ్యాపారం ఉందన్నారు. జయభేరి బ్యానర్‌పై 25 సినిమాలను నిర్మించానని కూడా వెల్లడించారు. తమ సొంత డబ్బుతోనే కుటుంబ సభ్యులతో కలిసి 1991లో జయభేరి ఫౌండేషన్‌ను స్థాపించి రియల్ ఎస్టేట్ వ్యాపారం ప్రారంభించామని, ఎక్కడా అక్రమాలకు పాల్పడలేదని వివరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+