అప్పుడే సభ వాయిదా, ఎడ్లబండిలో వచ్చిన చంద్రబాబు

సభ్యుల తీరును బిజెపి సీనియర్ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి తప్పు పట్టారు. సభా మర్యాదలను టిడిపి పాటించలేదని విమర్శించారు. రాజేశ్వర్ రెడ్డి మృతికి సంతాపం ప్రకటించే అవకాశం కూడా ఇవ్వక పోవడం శోచనీయమన్నారు. కాగా అంతకుముందు టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించి అసెంబ్లీకి ఎడ్లబండి పైన వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. రైతుల కోసం పోరాడతామని చెప్పారు.
మరోవైపు తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభ్యులు అంబేడ్కర్ విగ్రహం నుండి అసెంబ్లీకి పాదయాత్ర ద్వారా వచ్చారు. టిడిపి అవిశ్వాసానికి మద్దతిస్తామని ఈ సందర్భంగా టిఆర్ఎస్ఎల్పీ ఈటెల రాజేందర్ చెప్పారు.












Click it and Unblock the Notifications