వైయస్ జగన్ మాట వినేది ఆరుగురు శానససభ్యులే

తీవ్ర గందరగోళం, అయోమయం మధ్య వైయస్ జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యులు రహస్యంగా సమావేశమై మంతనాలు జరుపుతున్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన మేకపాటి చంద్రశేఖర రెడ్డి తమ వర్గం శాసనసభ్యులతో మాట్లాడుతున్నట్లు తెలుస్తోంది. జగన్ నిర్ణయానికి కట్టుబడి అవిశ్వాసానికి మద్దతివ్వాలని ఆయన శాసనసభ్యులకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. గచ్చిబౌలిలో వారంతా రహస్యంగా సమావేశమైనట్లు తెలుస్తోంది. మేకపాటి చంద్రశేఖర రెడ్డితో పాటు శోభా నాగిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, బాలినాగి రెడ్డి వంటి ఆరుగురు శాసనసభ్యులు మాత్రమే జగన్ మాట గట్టిగా నిలబడినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications