చిదంబరం ప్రకటనను జోక్: టి - కాంగ్రెసు ఎంపిలు

Rajaiah and Poonam Prabhakar
న్యూఢిల్లీ: తెలంగాణ అంశంపై ఏర్పాటు చేసే అఖిల పక్ష సమావేశం గురించి కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం చేస్తున్న ప్రకటనను ప్రజలు జోక్‌గా భావిస్తున్నారని కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులు పొన్నం ప్రభాకర్, రాజయ్య అన్నారు. తెలంగాణపై పార్టీలు అభిప్రాయం చెప్పడానికి నిర్ణీత గడువు విధిస్తూ చిదంబరం లేఖలు రాయాలని, ఆ నిర్ణీత గడువులోగా పార్టీలు తెలంగాణపై ఒకే అభిప్రాయాన్ని వెల్లడించకపోతే పాత అభిప్రాయాన్నే పరిగణనలోకి తీసుకుంటామని కూడా చెప్పాలని వారు గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు.

తెలంగాణపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయడానికి చిదంబరం నిర్దిష్టమైన గడువు పెట్టాలని వారన్నారు. డిసెంబర్ 30వ తేదీలోగా రాష్ట్రానికి చెందిన రాజకీయ పార్టీలు తెలంగాణపై అభిప్రాయాలు చెప్పకపోతే పాత అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని వారన్నారు. గతంలో వెల్లడించిన అభిప్రాయానికే ఆ పార్టీలు కట్టుబడి ఉన్నట్లు భావించాలని వారన్నారు. తెలంగాణ కోసం తమ కాంగ్రెసు పార్టీకి చెందిన శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు చట్టసభల్లో పోరాడాలని వారు సూచించారు. పార్లమెంటులో తాము పోరాడుతున్నట్లుగానే శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు పోరాడాలని వారు సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+