చిరంజీవిని, బాబును ఆడిపోసుకున్న వైయస్ జగన్

చిరంజీవి బలంతో నడుస్తున్న ప్రభుత్వం చంద్రబాబుతో రహస్య ఒప్పందం కుదుర్చుకుందని ఆయన అన్నారు. చంద్రబాబు కాంగ్రెసు పెద్దలతో ఒప్పందం కుదుర్చుకోవడం వల్లనే రాష్ట్ర ప్రభుత్వంలో దీమా కనిపిస్తోందని ఆయన అన్నారు. తన వెంట నడిచే శానససభ్యులు అవిశ్వాస తీర్మానానికి మద్దతిస్తారని, తాము ఉప ఎన్నికలకు సిద్దంగానే ఉన్నామని ఆయన అన్నారు. తనకు మద్దతిస్తున్న శాసనసభ్యులను లోబరుచుకోవడానికి ప్రభుత్వం అని రకాల ప్రయత్నాలు చేస్తోందని ఆయన అన్నారు. విలువలు, విశ్వసనీయతలకు అర్థం తెలియని పార్టీలు తెలుగుదేశం, కాంగ్రెసు అని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబు ప్రతిపాదించే అవిశ్వాస తీర్మానం పట్ల నిజాయితీ లేదని ఆయన అన్నారు. చంద్రబాబు అవిశ్వాసం ప్రతిపాదించడం ప్రజలు, రైతులపై ప్రేమతో కాదని, ప్రేమ ఉంటే ఆరు నెలల క్రితమే అవిశ్వాసం ప్రతిపాదించేవారని ఆయన అన్నారు. తుఫాన్లు, కరువులతో రైతులు ఇక్కట్ల పాలైనా, ఫీజుల కోసం పిల్లలు అల్లాడిపోయినా చంద్రబాబు అవిశ్వాసం ఊసెత్తలేదని ఆయన అన్నారు. ప్రభుత్వాన్ని ఇంటికి పంపించే సమయం వచ్చినప్పుడు చంద్రబాబు మాట్లాడలేదని, ప్రభుత్వానికి దీమా వచ్చిన తర్వాతనే అవిశ్వాసం మాట ఎత్తారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications