అవిశ్వాసం వేడి: జగన్‌ను చిక్కుల్లో పెట్టిన చంద్రబాబు

కాంగ్రెసుతో ఎవరు కుమ్మక్కయ్యారో తేలిపోతుందని తెలుగుదేశం పార్టీ విప్ దూళిపాల నరేంద్ర చౌదరి జగన్‌ను ఉద్దేశించి అన్నారు. జగనే స్వయంగా తన వర్గం శాసనసభ్యులను కాంగ్రెసులోకి తిరిగి పంపిస్తూ ప్రభుత్వానికి సహకరిస్తున్నారనే పద్ధతిలో ఆయన మాట్లాడారు. ఇది జగన్‌పై రాజకీయంగా పైచైయి సాధించడానికి కచ్చితంగా చంద్రబాబుకు పనికి వస్తుంది. సిబిఐ దర్యాప్తు నేపథ్యంలో జగన్ ఢిల్లీలో కాంగ్రెసు పెద్దలతో కుమ్మక్కయ్యారనే ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో తన వర్గం శాసనసభ్యులు ప్రభుత్వానికి మద్దతిస్తే ఆ ప్రచారం నిజమనే అభిప్రాయం బలపడే అవకాశాలున్నాయి. ఇది వైయస్ జగన్‌కు రాజకీయంగా పెద్ద దెబ్బే అవుతుంది.
పరిస్థితి తీవ్రతను గమనించిన వైయస్ జగన్ ఓదార్పు యాత్రకు విరామం ఇచ్చి హుటాహుటిన హైదరాబాదుకు బయలుదేరారు. సాధ్యమైనంత ఎక్కువ మంది జారిపోకుండా చూసుకునేందుకు ఆయన ప్రయత్నాలు సాగిస్తున్నారు. తన నిజాయితీని, చిత్తశుద్ధిని నిరూపించుకోవడానికి తన వర్గం శానససభ్యులను తన వెంట ఉంచుకుని, అవిశ్వాసానికి మద్దతు ఇవ్వడం తప్ప మరో మార్గం జగన్‌కు కనిపించడం లేదు. ఈ స్థితిలో ఆయన రేపు శనివారం తన వర్గం శానససభ్యులతో సమావేశం కానున్నారు. మొత్తం మీద. రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి.












Click it and Unblock the Notifications