తెలంగాణపై తీర్మానం పెట్టాలి: ఈటెల రాజేందర్ డిమాండ్

యుపి సిఎం మాయావతి పది నిమిషాల్లో ప్రత్యేక రాష్ట్రాల విభజనను ఆమోదించాయని ఇక్కడ అన్ని పార్టీలు కలిసి వస్తే నాలుగు నిమిషాల్లో పూర్తవుతుందని కెటిఆర్ అన్నారు. ఆ తర్వాత అవిశ్వాసంపై నాలుగు రోజులు చర్చించినా తమకు అభ్యంతరం లేదన్నారు. టిడిపి, కాంగ్రెసు అవిశ్వాసం నాటకం ఆడుతున్నాయన్నారు. తెలంగాణపై అవిశ్వాసానికి టిడిపి మద్దతివ్వాలన్నారు. లేదంటే వాళ్ల బండారం తెలంగాణ ప్రజలు గుర్తిస్తారన్నారు. కాగా అంతకుముందు టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్ నాదెండ్ల మనోహర్‌కు తెలంగాణపై అవిశ్వాసం నోటీసు ఇచ్చారు. కాంగ్రెసు తెలంగాణకు మోసం చేసిందని అందులో పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications