టిడిపి అవిశ్వాస తీర్మానం: సవాల్‌గా తీసుకున్న జగన్

YS Jagan
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి తన వర్గం శాసనసభ్యులు ఎవరూ జారిపోకుండా తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందు కోసం తాను దేనికోసమైనా సిద్ధమని తన వర్గం ఎమ్మెల్యేలకు సంకేతాలు ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ కిరణ్ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టడం, దానికి ప్రభుత్వం అంగీకరించడంతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ప్రభుత్వానికి ఎవరు అండగా ఉన్నారో తేల్చేద్దామన్న తెలుగుదేశం పార్టీ వ్యాఖ్యలను సవాల్‌గా తీసుకొని జగన్ తన ఎమ్మెల్యేలతో కలిసి కిరణ్ ప్రభుత్వానికి తాను వ్యతిరేకమని నిరూపించుకునే పనిలో పడ్డారు.

ఇందుకోసం జగన్ గుంటూరు జిల్లా ఓదార్పు యాత్రకు బ్రేక్ ఇచ్చి హుటాహుటినా హైదరాబాద్ బయలుదేరారు. ఇప్పటికే కొందరు ప్రభుత్వానికి మద్దతిస్తామని ప్రకటించడంతో మిగిలిన వారితో అవిశ్వాసానికి అనుకూలంగా ఓటు వేయించే ప్రయత్నాలు చేస్తున్నారు. తన వర్గం ఎమ్మెల్యేలకు ప్రభుత్వం అభివృద్ధి తాయిలాలు చూపిస్తుంటే జగన్ వారి కోసం దేనికైనా సిద్ధమంటున్నారు. తన వర్గంలోని కొందరు ప్రభుత్వం వైపు మరలడంతో కాంగ్రెసు నుండి కొత్తగా వచ్చే వారి కోసం ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు.

అయితే జగన్ ఎంతగా ప్రయత్నించినప్పటికీ పదిహేను మంది శాసనసభ్యులకు మించి అతని వెంట ఉండే అవకాశాలు కనిపించడం లేదు. ప్రారంభం నుండి జగన్ వెన్నంటి ఉండే వారి సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేస్తే శాసనసభ్యత్వాన్ని కోల్పోయే పరిస్థితి ఉండటంతో జగన్‌కు సన్నిహితులైన ద్వారంపూడి, ఆదినారాయణ రెడ్డి వంటి వారు కూడా టిడిపిని సమర్థించమని చెప్పేశారు. కాగా గొల్ల బాబురావు, బాలరాజులను ద్వారంపూడి సిఎం వద్దకు తీసుకెళ్లారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+