అప్పుడే కాదు: జగన్ వర్గంపై చర్యలు ఇప్పుడు లేనట్లే

మంగళవారం మీడియాతో మాట్లాడిన కొండ్రు విప్ ధిక్కరించిన వారిపై చర్యలకు మేం సిద్ధంగా ఉన్నామని అయితే ఇందుకు మరో నాలుగు రోజులు పట్టవచ్చునని చెప్పారు. చర్యలు తీసుకుంటామన్న మా నిర్ణయంలో మాత్రం ఎలాంటి మార్పు లేదని చెప్పారు. పిసిసి చీఫ్ బొత్స కూడా చర్యలుంటాయని చెబుతూ సిఎం నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. కాగా ఇప్పటికే ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలలో ఎన్నికలు జరగవలసి ఉంది. విపి ధిక్కరించిన 16 కాంగ్రెసు, ఒక పిఆర్పీ ఎమ్మెల్యేలపై వేటు పడితే మొత్తం 24 నియోజకవర్గాలలో ఎన్నికలు జరపవలసి ఉంటుంది.
సాధారణంగా ఓ పార్టీ గుర్తు ద్వారా గెలిచి మరో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్న పక్షంలో ఆ పార్టీ నుండి ఫిర్యాదు అందితే స్పీకర్ ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా, వారి వదన వినకుండానే డిస్ క్వాలిఫై చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ నేపథ్యంలో స్పీకర్‌కు అప్పుడే ఫిర్యాదు చేయకుండా వారిపై ఆచితూచి ధోరణితో వెళ్లేందుకు కాంగ్రెసు పార్టీ నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది. ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసి ఒకరోజు పూర్తయింది. అయినప్పటికీ చర్యలుంటాయని చెప్పడమే కానీ ఇప్పటి వరకు వారు స్పీకర్‌కు ఫిర్యాదు చేయలేదు. దీంతోనే వారు అనర్హత వేటు విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నట్లుగా కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications