హైదరాబాద్: ఎంఎస్ రెడ్డి విలువల కోసం పాటుపడిన వ్యక్తి అని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సోమవారం అన్నారు. చంద్రబాబు ఎంఎస్ రెడ్డి మృతదేహానికి నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ముప్పై ఏళ్లుగా రెడ్డితో తనకు అనుబంధముందని గుర్తు చేసుకున్నారు. విజయవాడ పార్లమెంటు సభ్యులు లగడపాటి రాజగోపాల్ మాట్లాడుతూ తనకు చాలా ఏళ్లుగా వారు తెలుసునని చాలా మంచి వ్యక్తి అన్నారు. ఆయనను కోల్పోవడం చాలా బాధాకరమన్నారు.
కాగా ఎంఎస్ రెడ్డి అంతిమ యాత్ర ప్రారంభమైంది. పంజాగుట్ట స్మశాన వాటికలో ఆయనకు అంత్యక్రియలు చేయనున్నారు. ఎంఎస్ రెడ్డి అంతిమయాత్రలో పలువురు రాజకీయ, సినీ రంగ ప్రముఖులు పాల్గొన్నారు.