జగన్‌కు లెక్కలు తెలియకపోతే చెప్తా: మంత్రి పితాని

Pithani Satyanarayana
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైయస్ జగన్మోహన్ రెడ్డికి లెక్కలు రాకుంటే తాను చెప్పేందుకు సిద్ధంగా ఉన్నానని మంత్రి పితాని సత్యనారాయణ సోమవారం అన్నారు. ఫీజు రీయింబర్సుమెంట్స్ విషయంలో జగన్ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారని విమర్శించారు. తెలుసుకోకుండా అలా మాట్లాడటం సరికాదన్నారు. ఫీజు బకాయిలు ఉన్నాయనేది శుద్ద అబద్దం అన్నారు.

రాష్ట్రంలో పదమూడు లక్షల దరఖాస్తులు ఇప్పటికే రెన్యూవల్ అయ్యాయని, మరో పది లక్షల ఉపకార వేతనాల దరఖాస్తులు పెండింగులో ఉన్నాయని చెప్పారు. విద్యార్థుల ఫీజుల విషయంలో ప్రభుత్వం ఎలాంటి జాప్యం చేయడం లేదన్నారు. కాగా కిరణ్ ప్రభుత్వంలో విద్యార్థులకు ఫీజు చెల్లింపులు జరగటం లేదని జగన్, ఆయన వర్గం ఆరోపిస్తున్న విషయం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+