ఓఎంఆర్ షీట్ బదులు: బిసి వార్డెన్ పరీక్షల్లో గందరగోళం

మరోవైపు నల్గొండ జిల్లాలో బిసి వార్డెన్ పరీక్షా పత్రం లీకైందనే పుకార్లు రావడంతో సెయింట్ ఆల్ఫోన్సెస్ పరీక్షా కేంద్రం వద్ద విద్యార్థులు ఆందోళనకు దిగారు. పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. ఈ కేంద్రం అమ్ముడు పోయిందంటూ ఆరోపించారు. జిల్లా అధికారులు, పోలీసులు విద్యార్థులకు నచ్చజెప్పే ప్రయత్నాలు చేశారు. అయినా అభ్యర్థులు పరీక్ష రాసేందుకు నిరాకరించారు. ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మరోసారి అధికారులు పరీక్షా పత్రం లీక్ కాలేదని నచ్చజెప్పడంతో పరీక్షలు రాసేందుకు విద్యార్థులు ఒప్పుకున్నారు.












Click it and Unblock the Notifications