వైయస్ కూడా జగన్‌లా చేయలేదు, మాకో అస్త్రం: విహెచ్

V Hanumantha Rao
ఖమ్మం: దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి కూడా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైయస్ జగన్మోహన్ రెడ్డిలా తెలుగుదేశం పార్టీతో ఎట్టి పరిస్థితుల్లోనూ చేతులు కలపలేదని కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత వి హనుమంత రావు ఆదివారం ఖమ్మం జిల్లాలో విమర్శించారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా వైయస్ టిడిపితో చేతులు కలిపిన సందర్భాలు లేవని ఆయన తనయుడు మాత్రం పదవి కోసం అవిశ్వాస తీర్మానం సమయంలో చంద్రబాబుతో చేతులు కలిపారని ధ్వజమెత్తారు. ఇది ఆయన పదవీ కాంక్షను తేటతెల్లం చేస్తోందన్నారు. ఇదే అంశాన్ని వచ్చే ఎన్నికల్లో ప్రచారాస్త్రంగా ప్రజలకు వివరిస్తామన్నారు.

రాజకీయంగా ఎదగడానికే వైయస్ జగన్ ఓదార్పు యాత్ర చేపడుతున్నారని విమర్శించారు. కాంగ్రెసు పార్టీ కార్యకర్తలకే నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేలకు ఆ పదవి ఇస్తే నియోజకవర్గాల్లో వారి ఆధిపత్యమే నడుస్తుందన్నారు. పార్టీ బలం పెరగాలంటే కార్యకర్తలకే నామినేటెడ్ పదవులు ఇవ్వాల్సిన అవసరముందన్నారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెసు విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. విప్ ధిక్కరించిన జగన్ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాల్సిందేనని అభిప్రాయపడ్డారు. అన్నా హజారే నియంతలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఆయన చెప్పినట్లే అన్నీ జరగాలంటే అది కుదరని పని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+