కెసిఆర్ లేస్తే పరుగులు తీస్తారు: టిడిపి నేతలపై కెటిఆర్

తెలుగుదేశం తెలంగాణ నాయకులు నిరాశ, నిస్పృలకు గురయ్యారని, అందుకే పనికి రాని మాటలు మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. తెలంగాణలో సీమాంధ్ర పెట్టుబడిదారుల ఆధిపత్యం కొనసాగుతోందని ఆయన విమర్శించారు. ఉద్యమాన్ని నీరు గార్చే కుట్రలు చేయవద్దని ఆయన అన్నారు. టెక్కీకి తమ సహకారం ఉంటుందని ఆయన చెప్పారు. సీమాంధ్ర ఆధిపత్యంలోని ప్రభుత్వాలు తెలంగాణలోని పరిశ్రమలను ప్రైవేట్‌పరం చేశారని, వరంగల్లులోని నిజాం షుగర్స్‌ను అతి తక్కువ ధరకు విక్రయించారని ఆయన చెప్పారు. తెలంగాణపై కాంగ్రెసు ఇచ్చిన మాటను తప్పిందని ఆయన విమర్శించారు. కెసిఆర్ ఎక్కడున్నా, ఏం చేస్తున్నా తెలంగాణ గురించే ఆలోచిస్తారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications