బొత్సతో తేడాల్లేవు, అవసరమైనప్పుడు విస్తరణ: సిఎం

అవసరమైతే మద్యం సిండికేట్లపై సిబిఐ విచారణకు అడుగుతామని ఆయన చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు గడువులపై తాను స్పందించబోనని, అభివృద్ధే తమకు ముఖ్యమని ఆయన అన్నారు. ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ అపాయింట్‌మెంట్ కోసం చూస్తున్నట్లు ఆయన తెలిపారు. కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ, అధిష్టానం నేతలు గులాం నబీ ఆజాద్, అహ్మద్ పటేల్‌లతో పార్టీ వ్యవహారాల గురించి, పెండింగులో ఉన్న ప్రభుత్వ పనుల గురించి మాట్లాడినట్లు ఆయన తెలిపారు. విప్ ధిక్కరించిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యులపై అనర్హత వేటుపై స్పీకర్ నాదెండ్ల మనోహర్ చూసుకుంటారని ఆయన అన్నారు. ఉప ఎన్నికల్లో సంక్షేమ కార్యక్రమాలే తమ ప్రచారాస్త్రాలని ఆయన చెప్పారు. మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, శంకరరావు వ్యవహారంపై అధిష్టానమే చర్యలు తీసుకుంటుందని ఆయన చెప్పారు.
ప్రపంచ పరిస్థితులకు అనుగుణంగానే విద్యుత్తు చార్జీల పెంపు ఉంటుందని, అన్ని రాష్ట్రాలు పెంచుతున్నాయి కాబట్టి మన రాష్ట్రం కూడా పెంచాల్సి వస్తోందని, విద్యుత్తు చార్జీలు పెంచకుంటే కేంద్రం ఇచ్చే నిధుల్లో కోత పడుతుందని ఆయన చెప్పారు. ఎక్కడ అవసరమైతే అక్కడ పన్నులు పెరుగుతాయని, వాటికి అనుగుణంగా సంక్షేమ కార్యక్రమాలు చేపడాతమని ఆయన చెప్పారు. కేంద్రం ఆదేశాల మేరకే 1 శాతం వ్యాట్ పెంచామని ఆయన చెప్పారు. రక్షణ రంగానికి అవసరమైన భూములు కేటాయిస్తామని ఆయన చెప్పారు. లక్ష ఉద్యోగాల ప్రధానికి లేఖ రాశామని, భర్తీ ప్రక్రియ ప్రారంభమవుతుందని ఆనయ చెప్పారు. ఒప్పందంలోని సమస్యల వల్ల కొన్ని 108 వాహనాలు ఆగిపోయాయని ఆయన చెప్పారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం, కేంద్రం త్వరలో నిర్ణయం తీసుకుంటాయని మాత్రమే తాను చెప్పానని ఆయన అన్నారు. మూడు జిల్లాలపై తుఫాను ప్రభావం ఉందని, తుఫాను వల్ల రాష్ట్రంలో నష్టం ఏమీ జరగలేదని ఆనయ చెప్పారు.












Click it and Unblock the Notifications