భోగాపురం జాతికి అంకితం - ప్రధాని మోదీ వేదికపై ప్రత్యేకంగా..!!
భోగాపురం ఎయిర్‌పోర్టు టెర్మినల్ భవనాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. టెర్మినల్ భవనాన్ని ప్రధాని పరిశీలించారు. రూ.4,727 కోట్లతో నిర్మించిన భోగాపురం ఎయిర్‌పోర్ట్ లో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఇదే సమయంలో ప్రధాని మోదీ రూ.17,912 కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టనున్నారు. కాగా.. ప్రధాని రాక వేళ అరుదైన ఆతిథ్యం అందు కొన్నారు. టెర్మినల్ భవనం పరిశీలన వేళ ప్రధాని మోదీ ప్రతీ అంశాన్ని ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు.
భోగాపురం విమానాశ్రయాన్ని ప్రధాని మోదీ జాతికి అంకితం చేసారు. టెర్మినల్ సందర్శనలో భాగంగా చెక్-ఇన్ హాల్, విమానాశ్రయ రూపకల్పన, సాంకేతిక ప్రత్యేకత లను ప్రధాని మోదీకి జీఎంఆర్ సంస్థ ప్రతినిధులు వివరించారు. ప్రారంభోత్సవం సందర్భంగా గిరిజన సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచానికి చాటిచెప్పేలా థింసా నృత్యాన్ని ప్రదర్శించారు. మొత్తం 13,750 మంది ఈ నృత్యం చేసి ప్రధానికి ఘన స్వాగతం పలికారు. ఆ తరువాత ఓపెన్ టాప్ జీపులో ప్రధాని మోదీ బహిరంగ సభ వేదిక వద్దకు చేరుకున్నారు. వేదిక మీదకు వచ్చిన ప్రధానికి సీఎం చంద్రబాబు బొబ్బిలి వీణ అందించారు. టెర్మినల్ భవనంలో ప్రత్యేకతలను మోదీ ఆసక్తిగా తిలకించారు.

#WATCH | Andhra Pradesh: Prime Minister Narendra Modi and Chief Minister N. Chandrababu Naidu speak candidly as they share stage at Bhogapuram in Vizianagaram.
— ANI (@ANI) August 1, 2026
PM will lay the foundation stone, inaugurate and dedicate to the nation multiple development projects worth over Rs… pic.twitter.com/DAGDvuL0FP
అక్కడ ఏర్పాటు చేసిన అత్యాధునిక సౌకర్యాలను పరిశీలించారు. ఈ సందర్భంగా విమానాశ్రయం నిర్మాణ విశేషాలు, టెర్మినల్ మాస్టర్ ప్లాన్, భవిష్యత్ విస్తరణ ప్రణాళికలను జీఎంఆర్ ప్రతినిధులు ప్రధానికి వివరించారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఈ విమానాశ్రయం కీలక మైలురాయిగా నిలుస్తుందని అధికారులు పేర్కొన్నారు. ఎయిర్‌పోర్టు మాస్టర్ ప్లాన్, ఏవియేషన్ హబ్, ఏవియేషన్ ఎడ్యుసిటీ నమూనాలను పరిశీలించారు. ఈ విమానాశ్రయం ద్వారా ఉత్తరాంధ్ర వైపు ప్రపంచం చూస్తుందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ఉత్తర ద్వారా దేశం కోసం తెరుచు కుందని వివరించారు. ఇదే సమయంలో విమానాశ్రయం విస్తరణ.. భవిష్యత్ ప్రణాళికల పైన ప్రధాని మోదీ సూచనలు చేసినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications