ఆంధ్రజ్యోతిపై కెటిఆర్ పైర్, సీమాంధ్ర జ్యోతిగా వ్యాఖ్య

ఓ పార్టీ పట్ల ప్రేమ ఉంటే, ఆ పార్టీ నాయకుడిని కాపాడుకోవాలనుకుంటే రాధాకృష్ణ కాపాడుకోవచ్చునని, కానీ ఇతరులను దుమ్మెత్తిపోయడం సరి కాదని ఆయన అన్నారు. ఆంధ్రజ్యోతి తెలుగుదేశం కరపత్రిక అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజల పట్ల విషపుత్రిక అని ఆయన ఆంధ్రజ్యోతిని అభివర్ణించారు. పత్రికను అడ్డు పెట్టుకుని ఏది పడితే అది మాట్లాడడం సరి కాదని ఆయన అన్నారు. గోబెల్స్, చంద్రబాబు అన్నదమ్ములని చెప్పిస్తానని, జర్మనీలో పుట్టిన గోబెల్స్ చంద్రబాబు పూర్వీకులని జర్మనీలో చెప్పిస్తానని, దాన్ని ఆంధ్రజ్యోతి పత్రిక రాస్తుందా అని ఆయన అన్నారు. నిరాధారంగా వ్యక్తిగత ఆరోపణలు చేయడం సరి కాదని ఆయన అన్నారు. ఆంధ్రజ్యోతి తన బుద్ధిని, నైజాన్ని, నైచ్యాన్ని బయట పెట్టుకుందని ఆయన అన్నారు.
చంద్రబాబును తెలంగాణలో అడ్డుకోవాల్సిన, పట్టించుకోవాల్సిన కర్మ తమకు పట్టలేదని, చంద్రబాబును ప్రజలే పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు. తెలుగుదేశం నాయకులు చిల్లరమల్లర మాటలు వాగుతున్నారని ఆయన అన్నారు. ప్రేమించుకుందాం రా అనేటువంటి సినిమాలు చూసిన ఓ నాయకుడు ఉరేసుకుందా రా అంటారని, మరో నాయకుడు మరో మాట అంటాడని ఆయన అన్నారు. తెలుగుదేశం తెలంగాణ నాయకులు చంద్రబాబుకు కట్టుబానిసలని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబు స్క్రిప్టు రాసిస్తే తెలంగాణ తెలుగుదేశం నాయకులు మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. చంద్రబాబు పనికిమాలిన నాయకుడని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications