వైయస్ జగన్ పార్టీలోకి మాజీ ఎమ్మెల్యే కుంజా భిక్షం

మూడు జిల్లాల్లో పార్టీ అడ్‌హాక్ కమిటీలకు వైయస్ జగన్ శుక్రవారం కన్వీనర్లను నియమించారు. విశాఖపట్నం కన్వీనర్‌గా గొల్ల బాబూరావు, విశాఖపట్నం అర్బన్ కన్వీనర్‌గా వంశీకృష్ణ, ఖమ్మం జిల్లా కన్వీనర్‌గా సీనియర్ నాయకుడు చందా లింగయ్య నియమితులయ్యారు. పలు జిల్లాలకు సమన్వయకర్తనలను కూడా జగన్ నియమించారు. కాగా, విశ్వ బ్రాహ్మణ ఐక్య యువ వేదిక రాష్ట్రాధ్యక్షుడు వెగ్గళం రాము నేతృత్వంలోని ఓ ప్రతినిధి బృందం శుక్రవారం వైయస్ జగన్‌ను కలిసింది. తమ డిమాండ్లకు మద్దతు ప్రకటించాలని ఆ బృందం జగన్‌ను కోరింది. విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసి దానికి ప్రభుత్వం వంద కోట్ల రూపాయలను కేటాయించాలని విశ్వబ్రాహ్మణలు డిమాండ్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications