కెసిఆర్‌కు ఊరట: పోటీ ఉండదని జగన్ ప్రకటన

"మా పార్టీ పిలుపు మేరకు విప్‌ను ధిక్కరించిన కాంగ్రెస్‌లోని 16 మంది స్థానాలు, పీఆర్పీలోని ఒక్క ఎమ్మెల్యే సీటు, అలాగే టీడీపీ అనుసరిస్తున్న విధానాలకు నిరసనగా మా పార్టీలో కలిసిన ప్రసన్నకుమార్‌రెడ్డి స్థానం ఇలా మొత్తం 18 అసెంబ్లీ స్థానాల్లో మా పార్టీ తరఫున రంగంలోకి దిగుతారు. అయితే.. మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే రాజేశ్వర్‌రెడ్డి అకాల మరణం వల్ల అక్కడ జరిగే ఉప ఎన్నికల్లో మా పార్టీ తరఫున పోటీ చేయాల్సిందిగా ఆయన సతీమణిని విజ్ఞప్తి చేస్తున్నాం. ఆమె మా పార్టీ తరఫున కాకుండా వేరే పార్టీ తరఫున పోటీ చేసినా ఆమెకు వ్యతిరేకంగా మేం పోటీ పెట్టకూడదని నిర్ణయించాం'' అని తెలిపారు.
"అలాగే తెలంగాణ కోసం రాజీనామా చేసిన వారు అంతకుముందు వరకు ఆయా నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహించిన ఎమ్మెల్యేలే. వారు ఒక బలమైన ఆకాంక్షతో పదవులు వదులుకున్నారు. ఈ మేరకు వారిని గౌరవించి, వారు ఏ పార్టీ తరఫున రంగంలోకి దిగినా.. వారిపై పోటీ పెట్టరాదని మా పార్టీ నిర్ణయం తీసుకుంది'' అని జగన్ ఆ ప్రకటనలో తెలిపారు. తాము తీసుకున్న ఈ నిర్ణయాలను ప్రజలు హర్షిస్తారనే విశ్వాసాన్ని ఆయన వ్యక్తంచేశారు.












Click it and Unblock the Notifications