జగన్ ప్రకటనకు ఎగిరి గంతేసిన తెరాస నేతలు

తెలంగాణ ఉప ఎన్నికల్లో పోటీ చేయబోమని జగన్ చేసిన ప్రకటనను జితేందర్ రెడ్డి స్వాగతించారు. తమ పార్టీ అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు స్థానికతపై తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపణలు చేయడాన్ని ఆయన తప్పు పట్టారు. కెసిఆర్‌ను రాజకీయంగా ఎదుర్కోలేకనే అటువంటి ఆరోపణలు చేస్తున్నారని ఆయన తెలుగుదేశం పార్టీ నాయకులను విమర్శించారు. కెసిఆర్ స్థానికతపై అనుమానాలు ఉంటే మొయినకుంటలోని రికార్డులు చూడాలని ఆయన సూచించారు. మహబూబ్ నగర్ శాసనసభా స్థానం నుంచి ఆకస్మికంగా మరణించిన శాసనసభ్యుడు రాజేశ్వర రెడ్డి సతీమణి పోటీ చేస్తారని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications