సురేఖ కోసం సీట్లు వదిలేస్తున్నారు: జగన్‌పై వీరశివా

కెసిఆర్‌తో, తెలుగుదేశం పార్లమెంటు సభ్యుడు సుజనా చౌదరితో చేసుకున్న ఒప్పందాలను జగన్ బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. జగన్‌లో వైయస్ రాజశేఖర రెడ్డి లక్షణాలు లేవని, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు లక్షణాలను పుణికి పుచ్చుకున్నారని ఆయన అన్నారు. తెలంగాణపై చంద్రబాబు వైఖరినే జగన్ అనుసరిస్తున్నారని, అది ద్వంద్వ వైఖరి అని ఆయన అన్నారు. తెలంగాణకు జగన్ అనుకూలమో, వ్యతిరేకమో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణపై జగన్ స్పష్టమైన వైఖరి వెల్లడించాలని ఆయన అన్నారు.
కెసిఆర్, జగన్ మధ్య ఒప్పందం ఎప్పుడో జరిగిందని, అది ఇప్పుడు వెలుగు చూసిందని కాంగ్రెసు మరో సీమాంధ్ర శానససభ్యుడు ఆనం వివేకానంద రెడ్డి అన్నారు. సమైక్యవాది వైయస్ కడుపున జగన్ చెడ పుట్టాడని ఆయన వ్యాఖ్యానించారు. సీమాంధ్రుల ఆత్మగౌరవాన్ని కెసిఆర్ పాదాల ముందు జగన్ తాకట్టు పెట్టారని ఆయన వ్యాఖ్యానించారు. వేర్పాటువాదినని జగన్ ప్రకటించాలని ఆనయ డిమాండ్ చేశారు. జగన్‌ను ఆయన సీమాంధ్ర ద్రోహిగా అభివర్ణించారు.












Click it and Unblock the Notifications